డ్యజిపిరెడ్డి స్వీట్ షాప్ పై ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనిఖీ

 

కాలం చెల్లిన ఆపిల్ జ్యూస్ బాటిల్స్ గుర్తింపు

కేసు నమోదు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాబలం) ఖమ్మం మయూరి సెంటర్లోని జిపి రెడ్డి స్వీట్స్ షాప్ పై ఫుడ్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. గత కొంతకాలంగా ఈ స్వీట్ షాప్ లో కాలం చెల్లిన మిక్స్డ్ ఆపిల్ జ్యూస్ ప్యాకెట్లు ను అమ్మకానికి పెట్టారు. ఈ వేసవి కాలంలో వినియోగదారులు ఎక్కువగా శీతల పాన్యాలు వినియోగిస్తున్న నేపథ్యంలో షాపు నిర్వాహకులు కాల పరిమితి దాటిపోయిన ఆపిల్ మిక్స్డ్ జ్యూస్ ప్యాకెట్లను అమ్మకానికి పెట్టారు. దీనిని గమనించని అనేకమంది కష్టమర్లు వాటిని కొనుగోలు చేసి సేవిస్తున్నారు.
అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్న సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ వెంటనే స్పందించి జిపి రెడ్డి స్వీట్ షాప్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన ఆపిల్ జ్యూస్ బాటిల్లను గుర్తించారు. విచారణ అనంతరం శాంపుల్స్ ను సేకరించి షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking