అధికారులు నామమాత్రపు సర్వే
గృహలక్ష్మిపైనే నిరుపేదల ఆశలు
ప్రజాప్రతినిధులచే లబ్ధిదారుల ఎంపిక
వార్డు మెంబర్లు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులే గృహలక్ష్మి లబ్ధిదారులు
సిరిమంతులకే సం(క్షేమం) పథకాలు
అధికారులు నామమాత్రపు సర్వే ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేక ప్రభుత్వం ఇచ్చే రెండు పడకల ఇళ్లకు మూడు లక్షల రూపాయలు. ఇస్తామనడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు అందించే సాయానికి తోడు కొంత అప్పుచేసి ఇల్లు. కట్టుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇల్లు నిరుపేదలకు గూడు కోసం ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఇండ్లను మాత్రమే ఇస్తామని పేర్కొ న్నారు. దీంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. గ్రామాల్లో పట్టణాలలో నాయకులు చెప్పిన వారి పేర్లు మాత్రమే చర్చించుకుంటున్నారు తుది జాబితాను ఎమ్మార్వో, రూపొందించిన ఎమ్మెల్యే చెప్పిన వారికి మాత్రమే ఇల్లు వస్తాయని ప్రజాప్రతినిధులు బహిరంగం చెబుతున్నారు. ఇప్పటికే దళిత బందు, బీసీ బందు పథకంలో అర్హులకు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. గృహలక్ష్మి పథకంలోనూ అదే తరహాలో అధికార పార్టీ కార్యకర్తలకే మంజూరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
గృహలక్ష్మికి అర్హతలు
తెల్ల రేషన్ కార్ట్, సొంత ఖాళీ స్థలం. అదే గ్రామా నికి చెందిన వారై. ఉండాలి. దీంతోపాటు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి
అధికారులు నామమాత్రపు సర్వే
గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు సర్వేను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు చెప్పిన వారిని ఒక చోటకు పిలిపించుకొని సర్వే నిర్వహించారని ధరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు పారదర్శకం గా సర్వే నిర్వహించి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తులు దారుని ఇంటికి వెళ్లి సొంత ఇల్లు ఉందా లేదా అనే విషయంపై పూర్తిస్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. జిల్లాలోని అన్ని మండలాల గ్రామపంచా యతీలో ఇటింటికి వెళ్లకుండా ఒక్క దగ్గరే ఉండి మాత్రంగా సర్వే నిర్వహిస్తున్నారని దరఖాస్తు దారులే బాహాటంగా చెప్తున్నారు. గృహలక్ష్మి పథకం కింద ఎదురు చూసే పేదలకు ఏ మేరకు ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది.