-పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా సెప్టెంబర్ 28: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. గురువారం పరకాల మండలం నాగారం గ్రామంలో రూపాయలు కోటి 80 లక్షలతో నాగారం నుండి మల్లక్కపేట వరకు, అలాగే నాగారం నుండి పైడిపల్లి వరకు రూపాయలు కోటి నలభై లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.కెసిఆర్ లాంటి మహోన్నత వ్యక్తి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆయన అన్నారు. రైతుబంధు,దళితబంధు,కల్యాణలక్ష్మి,గృహలక్ష్మి,పింఛన్లు తదితర పథకాల ద్వారా అందే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచుతారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు ఆచరణలో సాధ్యం కావని, అది కాంగ్రెస్ కు సాధ్యపడదని ఆయన అన్నారు.కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను నిలుపుకోవడంలో విఫలమవుతుందని ఆయన విమర్శించారు.తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తమ దైవంగా ఆరాధిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కెసిఆర్ మా ముఖ్యమంత్రి అయితే బాగుండునని అంటున్నారని ఆయన చెప్పారు.

రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని ఆయన కొనియాడారు. నాగారం గ్రామంలో 86 మంది వికలాంగులకు రూపాయలు నాలుగు వేల చొప్పున,203 మంది వృద్ధులకు, 88 మంది వితంతువులకు,60 మంది చేనేత కార్మికులకు,44 మంది గౌడ కులస్తులకు,15 మంది ఒంటరి మహిళలకు,29 మంది బీడీ కార్మికులకు ప్రభుత్వ పింఛన్లు అందుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు.నాగారం గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవారెడ్డి, ఎమ్మెల్యే వెంట ఉన్నారు.కాగా పరకాల వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలువేరు మొగిలి,జిల్లా రైతు కమిటీ కన్వీనర్ బొల్లె బిక్షపతి,జిల్లా రైతు సమన్వయ కమిటీ డైరెక్టర్ సిహెచ్ సాంబారెడ్డి, టిఆర్ఎస్ నాగారం గ్రామ కార్యదర్శి బొమ్మకంటి శంకర్,గ్రామ యూత్ నాయకులు పాలకుర్తి దిలీప్,రైతు కన్వీనర్ మద్దెల బాబు,మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ ఎరుకొండ శ్రీనివాస్,పిఎసిఎస్ పరకాల సొసైటీ చైర్మన్ నాగయ్య,పసుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.