👉మాట తప్పని నైజాం మడమ తిప్పని పాదం హరిశన్న:ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
👉 సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణంలో పాటల సీడీ ఆవిష్కరణ.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 29(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి:వచ్చే నేల 03వ తేదీన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుజన్మదినం సందర్భంగా కోహీర్ పిఎసిఎస్ చైర్మన్ స్రవంతీ అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు,అనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ హరీష్ రావు,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ,ప్రజా గుండెలో నిలిచే నాయకుడు,పిలిస్తే పలికే నాయకుడు హరీష్ రావు అంటే కొండంత అండ,హరీష్ రావు పాటల సీడీ ఆవిష్కరణ లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం అని అన్నారు,పాటల సీడీ ఆవిష్కరణకు కృషి చేసిన స్రవంతి అరవింద్ రెడ్డిని అభినందించారు,సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ మాట తప్పని నైజాం మడమ తిప్పని వ్యక్తం హరీష్ రావు, ఏ శాఖ ఇచ్చిన సమర్థవంతంగా తనదైన ముద్ర వేసుకుంటారు,హరీష్ రావుకి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అప్పజెప్పితే శక్తి వంచన లేకుండా అప్పటి గవర్నర్ చేత కాళేశ్వర్ రావు అనే పేరు సంపాదించిన ఘనత హరీష్ రావుకి దక్కుతుంది నాయకులకు గాని, ప్రజలకు గాని ఎలాంటి సమస్య ఉన్న నేను ఉన్న అంటూ భరోసా కల్పించి గుండెకు హత్తుకునే నాయకుడు హరీష్ రావు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి,డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం,శివరాజ్ పాటిల్,చింత గోపాల్,మందుల వరలక్ష్మి, ఆర్ వెంకటేశ్వర్లు,నర్సింలు,మాజీ కౌన్సిలర్లు ,జహీరాబాద్ నియోజకవర్గ వివిధ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ,వెంకటేశం,సంజీవ రెడ్డి నర్సింలు, తదితరులు ఉన్నారు.