ఖమ్మం ప్రతినిధి నవంబర్10(ప్రజాబలం)ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రఘునాథపాలెం మండలంలో గణేష్ గార్డెన్ లో బోడెపుడి ఫౌండేషన్ నాయకులు బోడెపుడి రాజా తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తుమ్మల ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘునాధపాలెం మండలం లో మట్టి గుట్టలు రుషికొండ లా కరిగి పోయాయి అక్రమ మట్టి వ్యాపారం తో వెయ్యి కోట్లు అక్రమ ఇసుక వ్యాపారం తో వెయ్యి కోట్లు దోచుకున్నారు మాఫీయా గ్యాంగ్ లు పోషిస్తూ స్థలాలు కబ్జా చేస్తోన్నారు ఖమ్మం లో ఎన్నడూ లేని అరాచకం రాజ్య మేలుతుంది రఘునాథ పాలెం మండలం గ్రామాల్లో బీఅర్ఎస్ కు డిపాజిట్లు రాకుండా చేయాలి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు బెదిరింపులు పోలీస్ కేసుల తో కాంగ్రెస్ శ్రేణులను భయపెడుతున్నారు అవినీతి లేని అభివృద్ధి ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ వెంకటేశ్వర్లు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
