ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 31 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి పార్టీలో సోమవారం చేరినారు.వారికి పార్టీ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్,డీకే అరుణ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.