ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సాదారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ…వర్షాకాలం దృశ్య పట్టణం లోని పలు రోడ్లపై ఏర్పడిన గుంతలను అవసరం మేర మొరం,స్టోన్ డస్ట్ పోయుటకు,పారిశుధ్య నిర్వహణ స్వయంగా జరుపుటకు,స్వచ్చ ఆటోల మరమ్మత్తు చేయించుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు.అనంతరం పదోన్నతి బదిలీ పై పెద్దపెల్లి మున్సిపల్ కు వెళుతున్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ని మున్సిపల్ కౌన్సిల్,సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ మాట్లాడుతూ…కమీషనర్ ఆకుల వెంకటేష్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ కి చేసిన సేవలు మరువలేనివన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు కోఅప్షన్ సభ్యులు మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,రాజ శేఖర్ సిబ్బంది పాల్గున్నారు.