లక్షెట్టిపేట తహసీల్దార్ జ్యోష్న బదిలీ

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట తహసీల్దార్ జ్యోష్న సోమవారం లక్షెట్టిపేట నుండి మంచిర్యాల ఆర్ డి ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా బదిలీ కాగా డెప్యూటేషన్ పై కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించనునట్టు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేసారు. లక్షెట్టిపేట కంటే ముందు నస్పూర్ లో తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన జ్యో 2022 ఫిబ్రవరి లో నస్పూర్ నుండి లక్షెట్టిపేట కు బదిలీ అయినారు.2022 నుండి 2023 జులై వరకు మండలానికి సేవలు అందించారు.కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న విజయనందం ని బదిలి పై లక్షెట్టిపేట నూతన తహసీల్దార్ గా జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేసారు. నూతన తహసీల్దార్ విజయనందం మంగళవారం విధులకు హాజరై బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking