జాతీయ కాంగ్రెస్ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీ 85 వ ప్లీనరీ సమావేశంలో ఏఐసీసీ, సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నేతలతో కలిసి హాజరు అయ్యారు.రాహుల్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి,ఆదిలాబాద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మంచిర్యాల నియోజకవర్గ పీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్, చెన్నూరు నియోజకవర్గ పిసిసి సభ్యులు నూకల రమేష్,బోథ్ నియోజకవర్గ పిసిసి సభ్యులు డాక్టర్ వన్నెల అశోక్,అసిఫాబాద్ నియోజకవర్గ పిసిసి సభ్యులు డాక్టర్ గణేష్ రాథోడ్,బెల్లంపల్లి నియోజకవర్గ పిసిసి సభ్యులు చిలుముల శంకర్,రొడ్డ శారద, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ,ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, బెల్లంపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్,డిసిసి సభ్యులు సూరం రవీంద్ర రెడ్డి, శారద,ముచ్చర్ల మల్లయ్య, నాయకులు చిలువేరు సత్యనారాయణ,ఎల్లయ్య,లక్ష్మణ్,రూపేష్,మోబిన్ లు హాజరయ్యారు.