ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : 5 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి,జివో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి,అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో కి వినతిపత్రం అందచేశారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్& ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున రాపల్లి గ్రామం నుండి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని, సమయానికి వేతనాలు ఇవ్వడం లేదు,గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల వేధింపులు పెరిగిపోయాయి.స్వంత పనులు కూడా చేయాలని మాపై ఒత్తిడి తెస్తున్నారు.లేదంటే మిమ్మల్ని పనిలో నుండి తిస్తెస్తాం అంటూ బెదిరిస్తున్నారు.రాష్ట్రంలో అన్ని రకాల కార్మికులకు పెంచినట్లుగా పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి రూ,,5 లక్షలా ఎస్కిడే ఇన్సూరెన్స్ అందించాలి.కేటగిరీల వారిగానే పనులు చేయించాలి.జిఓ 60 ప్రకారం పరిశుద్య కార్మికులకు 15,600 వేతనం చెల్లించాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని,పిఎఫ్ ఈఎస్ఐ మరియు ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని,తపాల శాఖ ప్రవేశపెట్టిన 399 ప్రీమియాన్ని జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రతి కార్మికులకు ప్రీమియం చేయించి అందించాలి.తదితర డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని లేని యెడల ప్రభుత్వం దిగిరాకపోతే కార్మికులు మరో సమ్మె పోరాటాన్ని కూడా సిద్ధమవుతారని తెలిపారు. ఈ పాదయాత్రకు దాసరి రాజేశ్వరి తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు , హాజీపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మామిడి రమేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి,చెవిటి మల్లేష్,లిక్కర్ గోదాం యూనియన్ అధ్యక్షులు శంకర్,మాజీ కార్యదర్శి శ్రీనివాస్,మహేందర్ కోశాధికారి, సంకె రవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి,దూలం శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, దాగం రాజారాం సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు,యూనియన్ జిల్లా అధ్యక్షులు అవునూరి సాగర్, దుమ్మాల సుధాకర్ జిల్లా కార్యదర్శి, చిన్నయ్య,రాజలింగు జిల్లా ఉపాధ్యక్షులు,రవి,లచ్చక్క
సహాయ కార్యదర్శి,సాయి కృష్ణ జిల్లా కోశాధికారి,పద్మ,కొమురయ్య సలహా దారులు,జిల్లా కమిటీ సభ్యులు రాజలింగు,శంకర్, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.