
సంగారెడ్డి ఫిబ్రవరి 25 ప్రజ బలం ప్రతినిధి
జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం శనివారం నాడు ప్రత్యేకంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.సంగారెడ్డి లోని సెంట్ ఆంటోని డిగ్రీ కళాశాలలో సంగారెడ్డి జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో 199 మంది కంటి పరీక్షలు చేసుకున్నారని తెలిపారు.
జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో పాటు అత్యంత ఉత్సాహంగా కంటి పరీక్షలు చేసుకున్నారని పేర్కొన్నారు. కంటి పరీక్షలు చేసుకున్న 199 మందిలో 43 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇచ్చామని,32 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఆర్డర్ చేసినట్లు తెలిపారు.16 మందికి సర్జరీ కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు. 108 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు తేలిందని చెప్పారు.
