రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర నేత మెదక్ పార్లమెంటు కన్వీనర్ వర్గంటి రామెహ్మన్ గౌడ్.

మెదక్ ప్రజా బలం న్యూస్ :-ఉమ్మడి మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా 11వేల శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా లో మెదక్ పార్లమెంటు కన్వీనర్ వర్గంటి రామెహ్మన్ గౌడ్ తన దైన శైలిలో ఉమ్మడి మెదక్ జిల్లా మండలాల్లో గ్రామంలో వీధి వీధిన పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం చేస్తూన్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తు, దేశంలో నరెంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,అప్పుడే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు గూర్తింపు వస్తుంది అన్నారు.బారతీయ జనాత పార్టీ దేశ ప్రాజలకు అండగా వుంటుంది అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు వర్గంటి రామెహ్మన్ గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరవీరుల త్యాగం పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం, ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ విధానాన్ని మరిచి రాష్ట్రంలోని నిరంకుశ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారని అన్నారు. కేసిఆర్ కుటుంబంకు విపరీతమైన ఆస్తులు పేరిగాయని ఆరోపించారు. తూప్రాన్ పట్టణంలో కూడా అన్ని పెండింగ్ పనులే ఉన్నాయన్నారు. ఇంతవరకు తూప్రాన్ ప్రజల్లో నిరుపేద అర్హులైన వారికి కాకుండా కొందరి ప్రజా ప్రతినిధుల అండతో అదికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద లకు డబుల్ బెడ్రూం ఇండ్లు రాకపోవడంతో లేకపోవడంతో ఇక్కడ కెసిఆర్ అభివృద్ధికి అద్దం పడుతుందన్నారు. ఇక్కడ మున్సిపాలిటీ పాలకవర్గానికి పంపకాల మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదని ,అందుకే విశ్వాసం కోల్పోయే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల మీద పాలకవర్గ సభ్యులపై ప్రజలు అగ్రహాం ఉన్నదని మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు బిజెపి శ్రేణులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking