ఎస్.బి.ఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి హృదయపూర్వక అభినందనలు తెలిపిన మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్ట్ 10 (ప్రజాబలం) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగు ప్రజలకు గర్వకారణమని బిఆర్ఎస్ పార్టీ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసులు శెట్టి కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో ఎస్.బి.ఐ. మరిన్ని విజయాలను సాధించి, మరెన్నో మైలురాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీనివాసులు శెట్టి నాయకత్వంలో బ్యాంక్ మరింత ముందుకు సాగి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్గదర్శకాలు సృష్టించేందుకు ఆయనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ పదవి చేపట్టడం ద్వారా దేశవ్యాప్తంగా తెలుగు ప్రజల ఖ్యాతి మరింత పెరుగుతుందని, బ్యాంకింగ్ రంగంలో తెలుగు ప్రజల ప్రతిభను ప్రదర్శించే అవకాశం అని ఆయన పేర్కొన్నారు