ఆయన మృతి మీడియా రంగానికి, సమాజానికి తీరని లోటు : నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి జూన్ 08 (ప్రజాబలం) ఖమ్మం మీడియా దిగ్గజం ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు అకాల అస్తమయం పట్ల ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సంతాపం తెలిపారు..తను నమ్మిన విలువలు, సిద్ధాంతం కోసం మీడియా ప్రపంచంలో ఆయన సాగించిన ప్రయాణం అసామాన్యమైందని పేర్కొన్నారు. ఆయన మృతి మీడియా ప్రపంచానికి, సమాజానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధించారు. ఆయన మన మధ్య సజీవంగా లేకున్నా ఆయన స్థాపించిన సంస్థల రూపంలో నిత్యం మన కళ్ళ ముందే ఉంటారని అన్నారు. సామాజిక సేవ ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన నిత్య కృషి వలుడని తెలిపారు.అక్షర యోధునిగానే కాకుండా సినీ నిర్మాతగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినీ స్థూడియా నిర్మాణం , వాణిజ్య వేత్తగా ఆయన సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తినీయమని నామ కొనియాడారు. నైతిక విలువలు, ప్రమాణాలతో పాత్రికేయునిగా మిన్నగా రాణించారని చెప్పారు. నిరంతర శ్రమ, కార్యదీక్ష, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమే రామోజీరావు అని నివాలర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.