– రామాజీ రావు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 08 : గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ గూడలోని స్టార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందగా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు.
రామోజీరావు ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు అని ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు