కొత్తగూడ మండలం లో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన

 

– మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మంత్రి సీతక్క గారు

– వెనుకబడిన కొత్తగూడ మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 08 : ఈ రోజు ములుగు నియోజక వర్గం లోని కొత్తగూడ మండలం లో పర్యటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఎంచ గూడెం గ్రామానికి చెందిన వాసం సువర్ణ,వాసం కిషేందర్,
కోణాపూర్ గ్రామానికి చెందిన ముడికే భిక్షం లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు అనంతరం మోకాళ్ళ పల్లి మొండ్రాయిగూడెం, సాదిరెడ్డి పల్లి,ఓటాయి,రెన్య తండా జంగావాని గూడెం,ఎదుల్లపల్లి
గోవిందా పురం,పెగడపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నా మంత్రి వర్యులు సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూమారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని కొత్త గూడ,గంగారాం మండలాల లో ఎన్నికల సమయములో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరతాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేశాం అని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ములుగు నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాధ్యత నాది అని నేను ప్రజల మనిషిని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిని నన్ను ఆదరించిన ములుగు ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి గారు అన్నారు అనంతరం గ్రామాల ప్రజలు తమ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరిస్తానని గ్రామాల ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking