ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాడిపంటలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుబిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరిపై దేవుని కృప ఉండాలని ఆకాంక్షించారు.