ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం శ్రీ చైతన్య మహిళా మండలి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు తోటపల్లి పద్మ కుమారుడు ఇసాక్ పుత్రికలు ఫిజియా మరియు కేజియా ల అన్నప్రసన్న వేడుకలను ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ అన్నప్రాసన్న వేడుకలకు యువజన సంఘాల సమితి రాష్ట్ర నాయకులు జక్కుల వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు కోడిరెక్క ఉమాశంకర్, జిల్లా నాయకులు గోగుల చంద్రశేఖర్, పగడాల కళ్యాణి, జన తెలంగాణ యూత్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి మహేష్ తదితరులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. తొలుత ఫాస్టర్ లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.