రైతులపై అత్యధిక రుణభారం మోపిన జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం

దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలువడం సిగ్గుచేటు
జేడియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు
అమరావతి మార్చ్ 21 ();దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలువడం సిగ్గుచేటని యునైటెడ్ జనతాదళ్ పార్టీ (జేడియు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు విమర్శించారు. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి భగవత్ రాజ్యసభలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ జాతీయ సగటుతో పోలిస్తే ఇది మూడింతలు అధికం. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆధాయం 10, 218 రూపాయలతో పోల్చితే.. ఏపీ రైతు కుటుంబాల ఆదాయం రూ. 10,403గా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం 2.56 ఆదాయం ఉన్నప్పటికీ ఆప్పు మాత్రం దాదాపు మూడురెట్లు అధికంగా ఉందని అంటున్నారని పేర్కొన్నారు.ఇక పొతే ఏపి లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలకు మంగళం పడిందన్నారు.రాష్ట్రంలో అత్యధిక మంది ఆధారపడేది వ్యవసాయంపైనే. సాగు చేయాలంటే పెట్టుబడి కావాలి. గతంలో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలు అందించేవారు. దీనివల్ల రైతన్నలకు వడ్డీల భారం తగ్గేది. కాని పావలా వడ్డీ రుణాలకు మంగళం పాడేసింది. వడ్డీతో సహా రుణం చెల్లిస్తేనే సున్నా వడ్డీ రాయితీ అని మెలిక పెట్టింది. దీంతో రైతుల పై వడ్డీల భారం పడుతోంది. ఇక 90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం లేదు. ఈ లెక్కన వైసీపీ ప్రభుత్వం వల్ల అన్నదాతలకు కొత్తగా ఒనగూరుతున్నదేమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి అందుతోంది. గత ప్రభుత్వంలో రాయితీపై సూక్ష్మపోషకాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, ఇలా అనేక రకాలుగా రైతాంగానికి లబ్ధి ఉండేది. ఇప్పుడు రాయితీ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు. కొన్ని పథకాలు ఉన్నాయో లేవో రైతులకే తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల రైతులకు మేలు జరగడం లేదు. వ్యవసాయానికి తగినంత ఊతం అందడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం, పరిహారం అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకొంటోంది. పెట్టుబడులు పెరగడం, అధిక వడ్డీలకు అప్పులు చేయడం, ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని తిరుపతి నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు

Leave A Reply

Your email address will not be published.

Breaking