చింతకాని మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి మే 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా చింతకాని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని నాగులవంచ, నేరడ, పందిపళ్లపల్లి తదితర గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. అదేవిధంగా చింతకాని మండల కేంద్రంలో జరుగుతున్న జేపీఎస్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డాక్టర్ కోటా రాంబాబు, కన్నెబోయిన సీతారామయ్య, కిలారు మనోహర్, నారపోగు వెంకటేశ్వర్లు, మందడపు శ్రీను, కొల్లి ఉపేందర్, బొరా వీరబాబు, గుండ్ల రాంబాబు, వలమల నాగేశ్వరరావు, వలమల వెంకటరామారావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking