మొక్కుబడి గా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నష్టపోయిన ప్రతి ఎకారాకి 20వేల నష్టపరిహారం చెల్లించాలి

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి మే 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం గ్రామం బౌద్ధ క్షేత్రం రహదారి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పరిశీలించారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగడం లేదని రైతులు దుర్గాప్రసాద్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే బి ఆర్ ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందన్నరు.కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వర్షాలకు తడిచి మొక్కలొస్తున్న కేసీఆర్ కు చీమ కుట్టినట్లైన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.నష్టపరిహారం పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ చేయలేదని.కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, నేలకొండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్నా నాయక్,చిట్టా సైదారెడ్డి ఉన్నం వెంకటేశ్వర్లు మాగం సైదులు గండు జానయ్య కందుల గురనాధం, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు శ్రీనాథ్,పగిడిమర్రి అజయ్,వంగూరి బాలాజీ,ధనవత్ హరి,సంతోష్,కోలికపోంగు శశి,గట్టిగుండ్ల విజయ్,తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking