కీలక పాత్ర పోషిస్తున్న వివో ఏ ల కు గౌరవ వేతనం కల్పించాలి

 

ఖమ్మం ప్రతినిధి మే 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి చేరవేయటంలో కీలక పాత్ర పోషిస్తున్న వివో ఏ ల కు నెలకు గౌరవ వేతనం 26000 ఇవ్వాలని ఇన్సూరెన్స్ పదిలక్షలు ఇవ్వాలని ఐకెపి వివో ఏ ల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుశీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేలకొండపల్లి వసుంధర ఒకేషనల్ కాలేజీలో మండల ఐకెపి వివో ఏ ల సంఘం అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుశీల మాట్లాడుతూ బైరవనపల్లి వివో ఏ ను అక్రమంగా తొలగించడం అన్యాయమని ఆమె చెప్పారు భైరవుని పల్లి వివో ఏ ను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆమె చెప్పారు గత 20 ఏళ్లుగా వివో ఏ లుగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె కోరారు ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శ్రీనివాసరావు జిల్లా కోశాధికారి రమేష్ మండల ఐకెపి వివో ఏ ల సంఘం అధ్యక్షురాలు నాగవల్లి వెంకటలక్ష్మి ఉపాధ్యాయురాలు మన్నే ఉమాదేవి కార్యదర్శి పొనుగోటి నాగమణి కోశాధికారి పసుపులేటి లక్ష్మి నాయకులు నెల్లూరు శేషమ్మ రూప శైలజ రమ ఎస్ కె రేష్మ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking