కులాదిపత్యాన్ని చూపించడానికే ఎన్టీఆర్ విగ్రహం – బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్
ఖమ్మం ప్రతినిధి మే 03 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ లకారం ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలను పెట్టకుండా ఎన్టీఆర్ విగ్రహం 54 అడుగుల ఎత్తుతో పెట్టడం అనేది మహనీయులను అవమానిస్తూ తమ కులహంకారాన్ని చాటుకోవడమేనని బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వెనక కులరాజకీయం, కులహంకారం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. శ్రీకృష్ణ అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతినవా అని, బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు ఖమ్మంలో ఒక్క బీఎస్పీ పార్టీలో తప్ప మిగిలిన అన్ని పార్టీల అధ్యక్షులు ఒక సామాజిక వర్గానికి చెందిన వర్గం కావడం వల్లనే ఈ కులహంకారం రోజు రోజుకు మితిమీరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూలే, అంబేడ్కర్ వంటి మహానుభావులను పట్టించుకోకుండా వారి విగ్రహాలను ప్రతిష్టించకుండా ఇటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలను పెట్టడాన్ని మహానీయుల ఆశయ సాధనకు కృషి చేస్తున్న బీఎస్పీ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. భావితరాలకు ఆదర్శవంతమైన మార్గనిర్దేశం చేయాలంటే ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు ఖమ్మంలో ఇకపై కుల రాజకీయాలు చేస్తే సహించేది లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు