ఖమ్మం ప్రతినిధి మే 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత ఆరు రోజులుగా తమని రెగ్యులర్ చేయాలని సమ్మె నిర్వహిస్తున్నారు పొంగులేటి అనుచరుడు,
మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు బుధవారం వారికి సంఘీభావంగా సమ్మెలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యపై మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పనులు, వాళ్ళు గ్రామాలకు చేసిన అభివృద్ధిపై ప్రశంసిస్తూ గ్రామాల్లో కార్యదర్శులు సమ్మెకు వెళ్లడం వల్ల గ్రామాల్లో పనులు కావటం లేదని దానివల్ల ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ ప్రత్యేక జీవో జారీ చేయాలని, లేని పక్షంలో ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ ప్రకటించి ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫతే మొహమ్మద్, రామ్మూర్తి గారు పాల్గొనడం జరిగింది.