రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోంది

 

మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మే 3:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ వారి సంక్షేమానికి నిత్యం కృషి చేస్తోందని ఈ విషయంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బుధవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) దేవసహాయంతో పాటు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించగా మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి వారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అందచేస్తోందని ఇది ఎంతో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం, మన ఊరు – మనబడితో పాటు మరెన్నో కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందని ఈ విషయంలో ప్రజల ఆదరణను చూరగొన్నామని సమావేశంలో మంత్రి మల్లారెడ్డి వివరించారు. అలాగే దీంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా అర్హులైన వారికి ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59 ప్రకారం వారికి భూములకు సంబంధించి ప ట్టాలు అందచేయడం జరిగిందని ప్రస్తుతం వారు సొంత ఇండ్లు కలిగిన వారిగా మారారని ఇది ఎంతో సంతోషకరమని మంత్రి మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని ఇది ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేక కృషితో ఎంతో అభివృద్ధి జరుగుతుందని సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాల్సిందిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి కోరారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఇదేతీరున అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో

చేపడుతున్న ఆయా కార్యక్రమాలపై సమావేశంలో సభ్యులు ఆయా శాఖలు చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా సంబంధిత శాఖల అధికారులు సమాధానాలిచ్చి అందుకు సంబంధించి పూర్తి వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా సమావేశంలో జిల్లా విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు వైద్య విధాన పరిషత్, రోడ్లు భవనాల శాఖలకు చెందిన అధికారులను జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్ర సమాచారాన్ని సమావేశములో సభ్యులకు తెలిపినారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సత్వరమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రస్తుతం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను అభివృద్ధిలో ముందుస్థానంలో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా అందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని మున్ముందు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా పరిషత్ సమావేశంలో వివరించారు. ఈ సమావేశానికి ముందు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా అమోయ్కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సమావేశం నిర్వహిస్తున్నందున జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ను జిల్లా పరిషత్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మూడుచింతపల్లి జడ్పీటీసీ సభ్యులు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking