ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 2 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ పాత గ్రామ పంచాయితీ నందు ‘మే’ డే ను పురస్కరించుకొని తెలంగాణా భవన నిర్మాణ సంఘం బోర్డు ఆధ్వర్యంలో లేబర్ కార్డు కలిగిన వారికి మెగా ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం మంగళవారం నిర్వహించారు.ఈ శిబిరానికి మండలంలోని లేబర్ కార్డు కలిగిన సుమారు 200 మంది పరీక్ష సేవలను వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏడి రఘునాథ్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వనిత,అసిస్టెంట్ లేబర్ అధికారి రామ్మోహన్,సీనియర్ అసిస్టెంట్ నరసింహ స్వామి,హెల్త్ క్యాంప్ మేనేజర్ రాజు,7 వ వార్డ్ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, మహేష్, రాందేని చిన్న వెంకటేష్,గంగాధర్, శేఖర్,నరేష్ అచ్చే తిరుపతి,లు తదితరులు పాల్గొన్నారు.