రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలి మే 6న ఇందిరా పార్క్ వద్ద రజక మహా ధర్నా

హైదరాబాద్ మే 2 (ప్రజా బలం ప్రతినిధి ): రజకులను వెంటనే ఎస్సి జాబితాలో చేర్చాలన్న ప్రదాన డిమాండ్ తోఅఖిల భారత రజక సంఘం ఆద్వర్యం లో ఈ నెల 6 న ఇదిరా పార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత రజక సంఘం అద్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బిసి భవన్ లో రాజ్యసభ సబ్యులు, బిసి సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా మహా ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ రజకుల పట్ల తెలంగాణా ప్రభుత్వం నిర్లక్ష్యం, సవతి తల్లి ప్రేమను కనబర్చుతుందని విమర్శించారు. రాష్ట్రము లోని రజకులకు వెంటనే కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని, దళితులకు ఇచ్చిన మాదిర్గా రజకులకు రజక బందు వెంటనే ఇవ్వాలని, ట్యాంక్ బండ్ పై తెలంగాణా పోరాట యోదురారు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలని,జనగామ జిల్లాకు రజక ఐలమ్మ పేరు పెట్టాలని, రాజకులకోసం ప్రత్యెక బర్జేట్ ను కేటాయించాలన్న మొదలగు డిమాండ్లతో ఈ మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో అఖిల భారత రజక సంఘం రాష్ట్ర అద్యక్షులు దాసారం సతీష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేతురి రవి, ఉపాధ్యక్షులు అకిన పల్లి గణేష్, రాష్ట్ర నాయకులు పోసాల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking