రెబ్బనపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలకు హాజరు అయ్యిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల ప్రతినిధి జిల్లా మే 2 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర కార్యక్రమానికి హాజరై దర్శనం చేసుకున్న కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు,ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ…రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంఘ పెద్దలు ఆమెకు ఘన స్వాగతం పలికినారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి,మండల అధికార ప్రతినిధి బొప్పిడి మురళీకృష్ణ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల దుర్గాప్రసాద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబడి తిరుపతి, సత్య గౌడ్,మన్నే దేవయా,కొట్టే మల్లేష్, బందెల శ్రీనివాస్ గౌడ్,జంగిలి ప్రసాద్,కోట్టేశ్రీనివాస్, ఎంబడి సురేష్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking