తూప్రాన్ సాయిబాబా మందిరంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు హాజరైన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ లో మున్సిపల్ పట్టణ కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ దేవాలయ 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులు ఎనరెల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఉదయం బాబాకు పంచామృతాభిషేకం, మంగళహారతులు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎనరెల్లి సాయిబాబా మాట్లాడుతూ ఈ సాయిబాబా సంస్థాన్ దేవాలయం మే02, 2007లో దళిత సంకల్పంతో వెలసిన సాయిబాబా ఈ రోజు కుల మతాలకతీతంగా కొంగు బంగారంగా అందరికి ఆశీర్వాదం అందిస్తూ సుఖ సంతోషాలను శాంతిని ప్రసాధిస్తున్న తూప్రాన్ సాయిబాబా సంస్థాన్ మందిరం అని కొనియాడారు. కార్యక్రమంలో ఎనరెల్లి సాయిబాబా దంపతులు, తూప్రాన్ తాజా మాజీ సర్పంచ్ చిట్టిమిల్ల శివమ్మ, సీనియర్ జర్నలిస్ట్ సి.ఆర్ జానకిరామ్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పూర్ణ రాజు గౌడ్, తూప్రాన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గైనిబైటి భాస్కర్ గౌడ్, నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking