కస్తూరిబా పాఠశాల టీచర్లను కాంట్రాక్టు టీచర్సుగా విధుల్లోకి తీసుకోవాలి

విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడించిన వందలాది మంది టీచర్లు
హైదరాబాద్ మే 2 ();సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 937 మంది కస్తూరిబా పాఠశాల టీచర్లను కాంట్రాక్టు టీచర్సుగా విధుల్లోకి తీసుకోవాలని వందలాది మంది టీచర్లు నేడు విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టడికి వివిధ జిల్లాల నుండి పెద్ద యెత్తున టీచర్స్ కదలివచ్చారు. ఈ ఉద్యమానికి నిరుద్యోగా జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్, నాయకత్వం వహించారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సబ్యులు ఆర్.ల్రిష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..అనంతరం టిచర్ల నుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో 17.11.2021 న నిబంధనల మేరకు కాంట్రాక్టు పద్ధతిన నియమించబడిన 937 మంది టీచర్సు రెండు సంవత్సరాలుగా చిత్తశుద్ధితో ఇతర సిబ్బందితో సహా విధి నిర్వహణ నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా వీరిని 09.03.2022న పిఇటి లను 23.04.2022 న పిజి టీచర్స్ ను, స్కూల్ టీచర్స్ ను అధికారులు విధులకు హాజరు కావద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే కస్తూరిబా పాఠశాల లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయినిలతో సమానంగా వేతనం రెగ్యులర్ గా ఇస్తామని నియామకం చేసి ఇప్పుడు వేతనం చెల్లించకుండానే మౌఖిక ఆదేశాలతో తొలగించారు. “సమాన పనికి సమాన వేతనం” అన్న సుప్రీంకోర్టు తీర్పు నిబంధన ప్రకారం వీరికి కనీసం చేసిన పనిదినములకు సరియగు వేతనం చెల్లించలేదు. జనవరి నెలలోమేము work from home duties & day by day duties కూడా చేసిన వీరికి కేవలం 7 రోజులకు మాత్రమే వేతనం చెల్లించారని,అయితే పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కావున గత నవంబర్ నుండి పని చేస్తున్న 937 టిచర్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ ఈ పోస్టులో కొత్తవారిని నియామకం నిబంధనలకు విరుద్ధము. సుప్రీంకోర్టు తీర్పుకు ప్రకారం పాత వారినే కొనసాగించాలని,వీరిని తొలగించి కొత్త వారిని నియమిస్తే సుప్రీంకోర్టు తీర్పును దిక్కరించడమే అవుతుందన్నారు.ఒకవైపు ముఖ్యమంత్రి గారు “మన ఊరు మన – బడి పథకం” కింద ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి 7200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యా ప్రమాణాలు గల విద్య పేద వర్గాలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకుంటుoటే విద్యా శాఖా అధికారులు టీచర్లను తొలగించుకుంటూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.మానవతా దృక్పథంతో పరిశీలించి విద్యార్థుల విద్యా బోధన కై నవంబర్ 2021 లో నియామకం చేయబడిన 937 మంది కుటుంబాలకు భద్రత కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉపాధ్యాయినిల మాదిరిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.ఈ ముట్టడిలో లో గుజ్జ సత్యం, నీల వెంకటేష్, నాని ముదిరాజ్, బోల్క వెంకట్ యాదవ్ వేముల రామ కృష్ణ, ఎమ్. పృధ్వీ గౌడ్, , మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking