ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 2 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని రెండవ రోజు కొనసాగించిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.కొక్కిరేల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చేస్తున్న సేవ కార్యక్రమాలను వివరించి చెప్పారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని తరువాత గ్రామాల్లో నెలకొన్న సాగునీటి సమస్య తాగునీటి సమస్య ఇతర సమస్యలన్నీ తీర్చుతామని హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల దుర్గాప్రసాద్, నాయకులు కంది సతీష్,కనక జంగూ,అడయి కాంతారావు,ఆకుల రామన్న,టి రాజయ్య,ప్రశాంత్, నిహల్ ఖాన్,సందాని,సళ్ళు,వేముల నర్సయ్య, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు కొట్నాక్క్ తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.