అకాల వర్షాలతో అన్నదాతలకు నష్టం
కొనుగోళ్లు అన్నిచోట్ల చేపట్టాలి
టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ రాజన్న డిమాండ్
జగిత్యాల ప్రతినిధి, మే 2:(ప్రజా బలం) కోసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన రైతన్నలకు అకాల వర్షాలతో నష్టం జరుగుతుందని కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలుగుదేశం జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల మండలంలోని పలుగ్రామాల్లో కొనుగోళ్ల కేంద్రాల్లో రైతుల తడిసిన వరి ధాన్యాన్ని టిడిపి నాయకులతో కలిసి రాజన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మహంకాళి రాజన్న మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కోసి కొనుగోలు కేంద్రాల్లో పోసారన్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో కురిసిన అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారన్నారు. వరి దాన్యములోని తేమ పేరిట జరిగే ఆలస్యంతో రైతులు దళారులకు 16 వందలకే అమ్ముకొంటు నష్టపోతున్నారన్నారు. రైతుకు పంటకు గిట్టుబాటు ధర వరికి 3 వందలు, మక్కలు, పప్పు ధాన్యాలకు 5 వందలు, పసుపు, మిర్చి 15 వందలు ఇవ్వాలని రాజన్న ప్రభుత్వాన్ని కోరారు. సత్వరమే అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని మహంకాళి రాజన్న కోరారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించి వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట టిడిపి నాయకులు బత్తుల కొండయ్య యాదవ్, సోమ నారాయణరెడ్డి, కోయ బాలకృష్ణ, నక్క లక్ష్మణ్, అరికేల గంగారెడ్డి, నారాయణ, గంగన్న, శ్రీనివాస్, బత్తుల రాజశేఖర్, రమేష్, లింగన్నలు ఉన్నారు.