జగిత్యాల జిల్లాలో అమల్లో పోలీస్ యాక్ట్

 

జిల్లా ఎస్పీ భాస్కర్

జగిత్యాల ప్రతినిధి, మే 2:(ప్రజా బలం) జగిత్యాల జిల్లాలో మే 1 నుంచి ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల జిల్లా పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించారదన్నారు. ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలన్న పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ భాస్కర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking