సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మే 1:
కార్మికుల బలిదానాల ఫలితమే 8 గంటల పని విధానం అని ఆనాటి పోరాటల స్ఫూర్తి మే డే అనే సిద్ధాపూర్ గ్రామ హమాలి యూనియన్ అధ్యక్షుడు బొక్క శంకర్ అన్నారు. 137వ మే డే ను పురస్కరించుకొని సోమవారం అసంపర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో హమాలీ కార్మికులతో కలిసి జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా నగరం చికాగోలో 1986వ సంవత్సరం 8 గంటల పని విధానం అమలు కోసం కార్మికులు కలిసికట్టుగా నిరవధిక సమ్మె బాట పట్టారని ఎందరో రక్తం చిందించి బలిదానాలు చేశారని అన్నారు. వారి పోరాట ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం అమలులోకి వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జనగం ధనలక్ష్మి కిరణ్, యూనియన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వార్డు మెంబర్లు కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking