వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మే1:
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ తూర్పు నియోజకవర్గం లో పలు డివిజన్లో కార్మికుల తో మే డే ను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్మికుల అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన తూర్పు నియోజకవర్గం లోని
వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్ శివనగర్ ఇసుక అడ్డా జంక్షన్ లో స్థానిక కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ.సుధాకర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు హాజరై జెండా ఎగురవేసినరూ. పోస్ట్ ఆఫీస్ కూడలిలో 27 28 డివిజన్లో కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, గందె కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలలో ఆటో రిక్షా కార్మికులు మున్సిపల్ కార్మికులు అంగన్వాడి టీచర్లతో కలిసి ఉత్సవాలను జరుపుకున్నారు. 12 మోరీల జంక్షన్, శంభునిపేట, ఊర్సు, కరీమాబాద్, ఎంజీఎం సర్కిల్ పోచం మైదాన్ కూడలి, కొత్తవాడ, ఆటోనగర్, పలు ప్రాంతాల్లో బి.ఆర్.టి.యూ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అహర్నిశలు కష్టపడుతూ తమ జీవనం సాగించే ప్రతి కార్మికుడు ఉన్నంతగా ఎదగాలని ఒక కార్మిక బిడ్డగా అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలుపంచుకుంటున్నానని అన్నారు. ఏ ఆపద వచ్చిన తోడుగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్దే తన ప్రధమ ఎజెండాగా పాటుపడుతున్నానని అందరం ఒక్కటిగా ఉండి అభివృద్ధిలో ముందుందామని అన్నారు. గతంలో తూర్పు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉండేదో ప్రస్తుతం పరిస్థితిన ఎలా ఉందో అంచనా వేసుకోవాలని అన్నారు. 27 అంతస్తులలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అధునాతన బస్టాండ్, నూతన కలెక్టరేట్ నిర్మాణనికి నిధులు మంజూరు అయ్యాయని రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసుకున్నామని ఇక మిగిలింది కేవలం ఉద్యోగ కల్పన కోసం కంపెనీలను స్థాపించడమేఅని, అది కూడా కార్మికులు తనకు తోడుగా ఉంటే సాధించి తీరుతానని హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ సుధాకర్ తో కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్, సోమిశెట్టి ప్రవీణ్,
దిడ్డి కుమారస్వామి,డివిజన్ అధ్యక్షులు మిరిపెళ్లి వినయ్,కార్మిక నాయకులు మర్రి శ్రీనివాస్,గాదె కుమార్,వివిధ కార్మిక సంఘాల నాయకులు,మహిళా నాయకురాలులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.