మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మే డే సందర్బంగా మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద
బి. ఆర్. ఎస్ కార్మిక సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్, గౌడ సంగం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు బొంది వెంకట్ గౌడ్ హాజరయ్యారు. బిఆర్ఎస్ కార్మిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో తూప్రాన్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి.ఎ ల అసోసియేషన్ అధ్యక్షులు సర్గల శ్రీనివాస్, యూనియన్ నాయకులు జయ కృష్ణ, మహేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్. సాజీద్ పాషా. లక్ష్మి నారాయణ. సాయినాథ్ హన్మంత్. శ్రీకాంత్ మహిపాల్, లక్ష్మణ్,
వీర భద్ర, వేణు గోపాల్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.