స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాని ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

 

మెదక్ తూప్రాన్ మే 1 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటా యిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్డిసి
చైర్మన్ వంటెర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ రైతులు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ప్రతాప్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులను రాజు చేయాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు రైతుల సేవలు ఎంతో అవసరం అని వారు బాగుండాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ రైతుల పక్షపతిగా ఉంటున్నారని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సంకల్పంతో ముందుకు వెళుతున్నారని అన్నారు. అనంతరం పి ఎస్ సి చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తూప్రాన్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బబుల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, ఎంపీడీవో అరుంధతి, ఎంపీ ఓ రమేష్, ఐకెపి ఎపిఎం రుక్మిణి, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేష్ యాదవ్, చంద్రశేఖర్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking