తడిసిన ధాన్యం కొని రైతులను ఆదుకుంటాం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 1: అకాల వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటుందని ఎమ్మెల్యే దివాకర్ రావు భరోసా నిచ్చారు. సోమవారం మండలంలోని పలు ప్రాంతాల్లో డీసీఎంఎస్,పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తడిసిన వరి ధాన్యం కుప్పలను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడవడం బాధాకరమన్నారు.తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు, జిల్లా కలెక్టర్ సంతోష్ బాధవత్ కు ఫోన్ లో రైతులకు జరిగిన నష్టాన్ని వివరించారు. రైతులు అధైర్య పడవద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీనిచ్చారు.అనంతరం తహసీల్దార్ జ్యోత్స్న ను ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతుల మేలు కోరుతూ మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking