ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

 

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నగరంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ముస్తాఫానగర్, నెహ్రునగర్, గణేష్ నగర్, స్వర్ణభారతి కల్యాణ మండపాల్లో జరిగిన పలు శు భకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. అదేవిధంగా పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, బొర్రా రాజశేఖర్, డాక్టర్ కోటా రాంబాబు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ మలీదు జగన్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, భీమనాథుల అశోక్ రెడ్డి, చల్లా రామకృష్ణరెడ్డి, కంభంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు, ఎయిర్ టెల్ నరసింహారావు, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, సుదగాని ఉపేందర్, లక్కీ, గౌస్, కొడాలి గోవిందరావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking