భారతరత్న అంబేడ్కర్ గారికి నివాళులర్పించిన ఎంపీలు రవిచంద్ర, దామోదర్ రావు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం సుప్రసిద్ధ విద్యావేత్త, ప్రఖ్యాత న్యాయకోవిదులు, ఆర్థికవేత్త దేశ ప్రప్రథమ న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ జీవీకే ఒన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీలు రవిచంద్ర, దామోదర్ రావులు శుక్రవారం సందర్శించి పూలమాల వేసి ఆయన దివ్య స్మృతికి నివాళులర్పించారు,ఆయన దేశానికి, అణగారిన వర్గాలకు అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, దామోదర్ రావుల వెంట బీఆర్ఎస్ యువజన నాయకులు జెన్నాయికోడే జగన్మోహన్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking