ఎమ్మెల్సీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన…కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి

 

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మే:24

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లి ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి బొకే అందజేసి మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని పేదల పెన్నిధి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ లో కీలక పదవి లో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కి తీసుకువచ్చిన ముఖ్యుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరు అని అన్నారు. పేదల పక్షాన నిలిచి ఉండే పార్టీ కాంగ్రెస్ అయితే దేశంలో దారిద్య నిర్మూలనకు కృషి చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో అబ్దుల్ బాకీ, ప్రభాకర్ రెడ్డి నగర్ అధ్యక్షులు సంజీవరావు, కాంగ్రెస్ నాయకులు రేష్మ (బి) బ్లాక్ అధ్యక్షరాలు, పొన్నం రజిత కెపిహెచ్బి డివిజన్ ప్రెసిడెంట్, అరవింద, నితీష్ కుమార్ గౌడ్, అక్బర్ భాయ్, అల్లావుద్దీన్, టిల్లు, మధు, మొయిస్, డా. విజయ భవాని, మధు, కలాం, దుర్గా ప్రసాద్, మహేష్, నిశ్చల్, శ్రీకాంత్, సుదర్శన్, నమ్రత, ప్రసన్న, నజీర్, శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking