ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 24 : మంచిర్యాల టి జీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఇ ఐ ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సీవోఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ రీజినల్ కోఆర్డినేటర్ కొప్యల స్వరూపారాణి ఒక్క ప్రకటన లో తెలిపారు.పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపీసీ, బైపీసీ,ఎంఈసీ,సీఈసీ, హెచ్ఈసీ, వోకేషన్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము కింద ఆన్లైన్లో రూ.100 చెల్లించాలని కోరారు.
ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఈ కింది వెబ్సైట్ ని సంప్రదించాలని https://www.tswreis.ac.in తెలిపారు.