ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 24 : మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలోని పారుపల్లి పంచాయతీ కేంద్రంలో ఉండి ఎర్రాయిపేట గ్రామానికి వెళ్లే అంతర్గత రహదారి అధ్వానంగా మారింది. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి దీంతో నిత్యం రాకపోగలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు వర్షాకాలం వస్తే బురదమయమై నడిచి వెళ్లేని పరిస్థితి ఏర్పడుతుంది.అధికారులు స్పందించి మెరుగైన రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.