ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 19 :
మందమర్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పూలమాలవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోతుకు సుదర్శన్ లు మాట్లాడుతూ ఇందిరా గాంధీ చిన్నతనం నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో గరీబ్ హఠావో అనే నినాదంతో పేద ప్రజల్లోకి వెళ్లి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇల్లు లేని వారికి ఇల్లు ఇంకా అనేక పథకాలను పేద ప్రజలకు అందించదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్, చెన్నూరు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్లూరి సునీల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు ఎండి సుకూర్, బూడిద శంకర్, సేవాదల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, మంకు రమేష్, జమాల్ పూరి నరసోజి, ఎర్ర రాజు, కడలి శ్రీనివాస్, దుర్గం ప్రభాకర్, రాయబారపు కిరణ్, తుంగపిండి విజయ్, రాచర్ల రవి, అందుగుల లక్ష్మణ్, ఆకారం రమేష్, సట్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.