ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 2:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి జయంతి ని పురస్కరించుకొని శనివారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారి చిత్రపటానికి పూలమాల వేసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా యువజన, క్రీడల శాఖ వారు నిర్వహించిన సైక్లింగ్ పోటీలలో విజేతలైనవారికి అదనపు కలెక్టర్, డి ఆర్ ఒ హరిప్రియ బహుమతి ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమంలో , జిల్లా పరిషత్ సి ఇ ఓ దిలీప్ కుమార్, పిడి డి ఆర్ డి ఎ సాంబశివరావు,యూత్ వెల్ఫేర్ అధికారి బలరాం, తదితరులు పాల్గొన్నారు.