ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేములవాడ -31 మార్చి ( ప్రజాబలం దినపత్రిక) వేములవాడ పట్టణంలోని సోమవారం రోజున రెండవ బైపాస్ రోడ్డు ప్రక్కన గల కూరగాయలు అమ్మే విక్రయ దారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సందీప్ కుమార్ ఝా లు కలిసి 68 స్టార్ లను నిర్మించడానికి మార్కెట్ జోన్ కు 80,0000/- లక్షలతో అలాగే 11,12 వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు గాను 56 లక్షల 50 వేల తో శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.