అందోల్ నియోజకవర్గం ప్రజనిది మార్చి 31 (ప్రజాబలం ) అందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండల పరిధిలో గల పెద్దారెడ్డిపేట, గ్రామంలో గల శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం, ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలుగు (విశ్వవసునామ) నూతన సంవత్సరం అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని, పెద్దారెడ్డిపేట్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ పెద్దగొల్ల శివ చందర్,అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో శ్రీ సిద్దేశ్వర ఆలయం నుండి స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా పురవీధుల్లో, భాజా భజంత్రీలతో, కోలాటాలు ఆడుతూ, సింగూరు ప్రాజెక్టు గంగమ్మ ఒడిలో, విగ్రహాలను కడిగి ఆలయానికి తీసుకొచ్చామని అన్నారు, ఉగాది రోజున సూర్యోదయం నుండి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితులచే ఈ నూతన సంవత్సర పంచాంగ శ్రవణం వినిపిస్తామని అన్నారు, సాయంత్రం వేళ రైతులు వారి ట్రాక్టర్లను వరుసగా గ్రామంలో డప్పు చప్పులతో ఆటపాటలతో ఊరేగించి, శ్రీ సిద్దేశ్వర ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ట్రాక్టర్లను,ఎడ్లబండ్లను, తింపి వారి మొక్కులను తీర్చుకుంటారు, ఈ నూతన (విశ్వవసునామ ) తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో నవవసంతం ఆనందమయం కావాలని, కోట్లాదిమంది తెలుగు ప్రజలందరికీ తెలుగు (విశ్వ వసు నామ) నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, తెలియజేశారు, ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజ మల్లయ్య, సురేందర్,,సత్యం,అశోక్, ఆంజనేయులు, ముదిరాజ్ సేవాసమితి జిల్లా అధ్యక్షుడు రాము, రాజు పటేల్, గుడాల విష్ణు, గ్రామ యువకులు భక్తులు పాల్గొన్నారు..