ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01(ప్రజాబలం)
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పెవిలియన్ గ్రౌండ్ నందు కార్బైడ్ రహిత మామిడిపండ్ల మేళాను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల అనుభవంతో కామేపల్లి మండలానికి చెందిన ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ కార్సైడ్ రహిత మామిడిపండ్లను ఖమ్మం నగర ప్రజలకు అందిస్తున్నారు. ఈ సీజన్ కు మామిడిపండ్ల కొరత చాలా ఎక్కువగా ఉందని పంట సరిగా దిగుమతి రాలేదని అన్ని రకాల పండ్లను ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులోకి సకాలంలో అందిస్తానని ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలెపు వెంకటరమణ హార్టికల్చర్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
