జలమండలి లైన్ మెన్ ల హస్తలాఘవం.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 ఏప్రిల్ 2025.
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట మంగళవారం రోజున ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ కాలనీ పార్క్ నుంచి తులిప్ గార్డెన్ కాలనీల లోని కొంతమేర పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు వెలుబుచ్చిన ప్రధాన సమస్యలు. చట్ట విరుద్దంగా 24 డిసెంబర్ 2024 రోజున తెలంగాణ మునిసిపాలిటీ అధికారులు ప్రజలకు చెప్పా పెట్టకుండా ఆస్తి పన్ను పెంచడం జరిగినదనీ, అట్టి పెరుగుదల పాత తేదీ 1 అక్టోబర్ 2024 నుంచి అమలు పరుస్తున్నామని తెలియ జేస్తూ, ఈ విషయమై మణికొండ మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇంటి పన్ను కొందరికి పెంచక, నోటీసు లాంటిది ఇవ్వ కుండా కొందరికి 3 రెట్లు పెంచడం, ఇట్టి పెంచిన తీరును మున్సిపల్ అధికారులను ప్రశ్నించి నప్పుడు గవర్నమెంటు ఆదేశాలను చూపించక పోవడం, పైపెచ్చు గత సంవత్సరం కొంత మందికే పెరిగింది గాని, నేటి నుంచి మొదలయ్యే ఈ సంవత్సరం అందరికీ పెంచుతామని చెప్పి తెలియ జేయడం విడ్డూరంగా ఉందనీ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పన్ను పెంచిన విషయం మణికొండ మున్సిపాలిటీ కౌన్సిల్ లో కూడా చర్చ చేయకుండా, కనీసం అధికారిక ప్రకటన జేయక పోవడం వారి బాధ్యతలను విస్మరించి నట్టుగా ఉందని స్థానికులు వాపోయారు. ఈ విషయంపై మణికొండ మున్సిపాలిటీ ఒక ప్రకటన చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. మంచినీటి కొరత తీవ్రంగా ఉన్నదని అందుకు తోడు స్తానిక లైన్ మెన్ ల హస్త లాఘవముతో నిర్ణీత సమయంలో మంచినీరు వదలకుండా ప్రజలకు ఇబ్బంది కలుగ చేస్తూ నీటి సరఫరా ఎప్పుడూ అని అడుగుతే తల తిక్కగా సాయంత్రం నాలుగు తర్వాత ఎప్పుడన్నా వదులుతం అని జవాబు చెపుతన్నారని స్థానికులకు తమ బాధను వెళ్ళ బుచ్చారు, కావున హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారు తక్షణమే స్పందించి చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న వారిని వెంటనే బదిలీ చేయవలసిందిగా బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేస్తో లేని యెడల ప్రజల సహకారంతో ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నామని తెలియ జేసినారు. కొన్ని చోట్ల రోడ్ల రిపేర్లు కారణంగా మట్టి కుప్పలు గుట్టలు గుట్టలుగా పోసి ఉండడం వలన రాకపోకలకు, వాహన దారులకు ఇబ్బంది కలుగు తుందనీ, చాలా చోట్ల చెత్త కుప్పలు పోగు చేసి పెట్టడం అందువలన దోమలు విపరీతంగా పెరుగుతున్న కారణముగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బందుల పాలు అవుతున్నారని కావున మున్సిపాలిటీ వారు స్పందించి మట్టి కుప్పలను మరియు చెత్త కుప్పలను తొలగించాలని కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, కుంభగల్ల ధనరాజ్, బుద్దోలు బాబు, శ్రీనివాస్ చారి, అందే లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, బండమీది మల్లేష్, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, దిలీప్, బొడ్డు శ్రీధర్, సుమనళిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking