భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈ నెల 18న కర్మనోఘాట్ హనుమాన్ దేవాలయం సమీపంలోని ఏపీఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు శ్రీ వీరభద్రస్వామి సేవా సమితి వ్యవస్థాపకురాలు కాసుల అనసూయ, అధ్యక్షులు షాబాద్ వెంకటేశ్వర్ తెలిపారు.
భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈ నెల 18న కర్మనోఘాట్ హనుమాన్ దేవాలయం సమీపంలోని ఏపీఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు శ్రీ వీరభద్రస్వామి సేవా సమితి వ్యవస్థాపకురాలు కాసుల అనసూయ, అధ్యక్షులు షాబాద్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి దేవాలయం ఎంతో ప్రతిసిద్ధిగాంచిందని, నగరంలో స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం ద్వారా ఇక్కడి భక్తులకు స్వామి వారి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. కల్యాణం కోసం నమూనా ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు. భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కల్యాణానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు సింగంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి కాసుల వినోద్, టీపీసీసీ ఓబీసీ విభాగం ఉపాధ్యక్షులు కట్టెల సుభాష్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బూరం శంకర్, న్యాయ సలహాదారులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
